ఉల్లిరసాన్ని ఆ ప్రాంతాల్లో రాసుకుంటే..?

శుక్రవారం, 22 మార్చి 2019 (11:04 IST)
ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఇవి వంటకు మాత్రమే కాదు సౌందర్య సాధనాలుగా కూడా ఉపయోగపడుతాయి. చర్మ రక్షణకు అవసరమైన పోషకాలు ఉల్లిలో అధిక మోతాదులో ఉన్నాయి. కాబట్టి ఉల్లిని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఓసారి తెలుసుకుందాం..
 
ఓ చిన్న ఉల్లిపాయ ముక్కను తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంటపాటు అలానే ఉంచుకుని ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ఎండవేడిమి వలన వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
 
బ్లాక్ పిగ్మెంటేషన్ వలన ముఖచర్మం నల్లగా మారి, పొడిబారుతుంటుంది. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ఉల్లిపాయ రసంలో కొద్దిగా శెనగపిండి, మీగడ కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చొప్పున చేస్తుంటే నాలుగు వారాలకు పిగ్మెంటేషన్ తగ్గి చర్మం తెల్లగా మారుతుంది.
 
ఉల్లిరసం నొప్పికి కూడా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే.. చర్మం కందిపోవడం, వాపును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా దోమకాటుకు, పురుగు కాటుకు కందిన ప్రాంతాల్లో ఉల్లిపాయ రసాన్ని రాసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫ్టెట్స్ రావు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు