చలికాలం.. చర్మానికి లోటస్ ఆయిల్ వాడి చూస్తే..?

సోమవారం, 18 జనవరి 2021 (22:48 IST)
Lotus oil
చలికారణంగా చర్మంలో అనేక మార్పులు వస్తాయి. అంతకుముందు ఉన్న మెరిసేదనం కోల్పోయి పేలవంగా తయారయిన చర్మాన్ని లోటస్ అయిల్ అందంగా మార్చుతుంది. సాధారణంగా డైరెక్టుగా ముఖానికి ఈ ఆయిల్‌ని అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫేస్ ప్యాక్ చేసుకున్నా బానే ఉంటుంది. వారంలో ఒక రెండుసార్లు చేస్తే చాలు మంచి ఫలితాలకి ఆస్కారం ఉంటుంది. 
 
ఇప్పటివరకు చర్మంపై చాలా ట్రై చేసి ఉంటారు. ఈ ఆయిల్ మృత చర్మకణాలని తీసివేసి, కొత్త కణాలని పుట్టిస్తుంది. దానివల్ల చర్మానికి సరికొత్త అందం వస్తుంది. వాతావరణంలో ఆర్ద్రత తగ్గిపోవడం వల్ల చర్మం తేమగా ఉండకుండా పొడిగా మారుతుంది. 
 
లోటస్ ఆయిల్ వల్ల పొడిబారిపోయిన చర్మం తేమగా మారుతుంది. అంతేకాదు, ముఖంలో కనిపించే ముడతల్ని తగ్గించి నల్లమచ్చలని తగ్గిస్తుంది. రోజూ వాడితే మంచి ఫలితాలు వస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు