వేసవికాలంలో శరీరం డీహైడ్రేట్ అవడం వలన పెదాలు ఎండిపోతుంటాయి. ఆ పగుళ్లపై నెయ్యి లేదా వెన్న రాస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. మెరుస్తాయి. కూడా. ఇక ముఖం మీద ముడతలు, కళ్లకింద నల్లటి వలయాలు పోవాలంటే పసుపులో కొద్దిగా మజ్జిగ, చెరుకు రసం వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి నిత్యం ముఖంపై, కళ్లకింద రాసుకుంటే నల్లటి వలయాలు పోతాయి. ఇక చర్మం ముడతలు పడదు.
తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాల వలన చర్మం మృదువుగా తయారవుతుంది. తేనెను నిత్యం ముఖానికి రాసుకోవడం వలన పొడిచర్మం సమస్యలు తగ్గడమే కాదు ముఖం కాంతివంతమవుతుంది. అన్నిరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఇది చెక్ పెడుతుంది. తేనెలో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. తేనెలో మెత్తటి మిరియాల పొడిని కలుపుకుని ముఖానికి నిత్యం రాసుకుంటే చర్మం మరింత మెరుపును సంతరించుకుంటుంది.