వీలైనప్పుడల్లా బాదం పప్పును నోట్లో వేసుకుంటే?

ఆదివారం, 15 డిశెంబరు 2019 (18:34 IST)
చర్మం ముడతలు పడకుండా వుండాలంటే.. బాదంను తప్పక తీసుకోవాలి. వీలైనప్పుడల్లా బాదం పప్పును నోట్లో వేసుకోండి. ఇది చర్మం ముడతల సైజు, తీవ్రత తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. 
 
నెలసరి నిలిచిపోయిన మహిళల్లో కొందరికి రోజువారీ ఆహారంలో కొద్దిగా బాదం పప్పు ఇచ్చి ఫలితాలను బేరీజు వేశారు. బాదం పప్పు తినని వారితో పోలిస్తే.. తిన్నవారిలో ముడతల సైజు పదిశాతం వరకు తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది.
 
బాదం పప్పులోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఒక్క చర్మ ఆరోగ్యానికే కాదు, క్యాన్సర్ల వంటి తీవ్ర సమస్యల నివారణకూ తోడ్పడతాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జబ్బుల బారినపడకుండా కాపాడుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు