2. కరివేపాకులను పొడిచేసి అందులో కొద్దిగా నీరు, వంటసోడా కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
3. టీ పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి అందానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.. టీ పొడిని నీటిలో మరిగించుకుని అందులో గోరింటాకు పొడి, బీట్‌రూట్ రసం కలిపి కాసేపు అలానే ఉంచాలి. అది బాగా చల్లారిన తరువాతు తలకు రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.
4. ఉల్లిపాయలు పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా పెరుగు, ఉప్పు, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. క్రమంగా ఇలా చేస్తే ముఖం ముడతలు తొలగిపోతాయి.
5. గోరింటాకు పొడిలో కొద్దిగా కీరదోస రసం, కలబంద గుజ్జు కలిపి ముఖానికి, మెదడు రాసుకోవాలి. గంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోతాయి.