గ్రీన్ టీ బ్యాగులతో సౌందర్యం.. మొటిమలు పరార్

బుధవారం, 6 అక్టోబరు 2021 (22:26 IST)
గ్రీన్ టీ బ్యాగులతో కూడా అందాన్ని పెంచుకోవచ్చు. సౌందర్యాన్ని పెంపొందించే సాధనాలుగా వాడుకోవచ్చు. గ్రీన్ టీలో చర్మ సంరక్షణకు కావలసినన్ని ఫోలిఫినోల్స్ కలిగి ఉండటం వల్ల చర్మాన్ని తాజాగా, తేమగా ఉండేలా కాపాడుతుంది. 
 
వాడేసిన గ్రీన్ టీ బ్యాగులని చల్లని నీటిలో నానబెట్టి వాటిని కళ్ల కింద వచ్చే వాపులకు తగ్గించేందుకు వాడొచ్చు. అలసట వల్ల కళ్ల కింద ఉన్న లేత చర్మంపై వాపు వస్తుంది. అలాగే నల్లటి వలయాలు కూడా వస్తాయి. వాటిని తగ్గించేందుకు గ్రీన్ టీ బ్యాగులను వాడుకోవచ్చు.
 
చల్లటి గ్రీన్ టీ బ్యాగుని ముఖంపై మొటిమలు వచ్చే ప్రాంతాల్లో పెట్టుకుంటే మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది. తరచూ గ్రీన్ టీ నీళ్లతో ఫేస్ వాస్ చేసుకుంటే ముఖంపై మురికి వంటివి పోయి మంచి టోన్ పొంద‌వ‌చ్చు. అలాగే గ్రీన్ టీ నీళ్లతో జుట్టుపై పోసుకుని మ‌సాజ్ చేసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు