నిత్య యవ్వనంగా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే!

గురువారం, 26 ఫిబ్రవరి 2015 (16:29 IST)
ముఖం నిత్య యవ్వనంగా ఉండాలంటే అందుకు కావాల్సిన తిండి తినాల్సిందే. మోనోశాచురేటెడ్ ఆయిల్, విటమిన్ ఇ, బి కాంప్లెక్స్ విటమిన్లను తీసుకోవాలి. చేపలు తింటే ఇవన్నీ లభిస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ వర్చస్సు ఎంతో మేలు చేస్తాయి. ముఖానికి సక్రమంగా రక్త ప్రసరణ జరగాలంటే ఎక్సర్‌సైజ్ తప్పకుండా చేయాలి. 
 
కళ్లు బాగా అలసిపోయినప్పుడు చల్లటి దోసకాయ ముక్కల్ని రెండు మూడు నిమిషాలు మూసుకున్న కనురెప్పల మీద ఉంచండి. కళ్లకు ఉపశమనం లభించడమే కాకుండా, ఇవి కళ్ల కింద నలుపును తగ్గిస్తుంది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  

వెబ్దునియా పై చదవండి