చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే?

శనివారం, 30 మే 2015 (17:15 IST)
ప్రతిరోజూ ఉదయం చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద పాలు చిలకరించి చేత్తో బాగా సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే ముఖం మెరిసిపోతుంది. అలాగే చీజ్‌తో కూడా మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. చీజ్‌ను తురిమి, మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా అయిన చీజ్‌ను ముఖం, మెడకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి మరకలు తొలగిపోతాయి. 
 
ఇక చర్మ సౌందర్యానికి శెనగపిండి బెస్ట్‌గా పనిచేస్తుంది. శెనగపిండి, రోజ్ వాటర్ రెండు మిక్స్ చేసి ముఖానికి పట్టిస్తుంటే 4 వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం పేస్టు కూడా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అంతే కాకుండా ఇది ముఖంలో మచ్చలు, మెటిమలను మాయం చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి