చర్మ రక్షణకు ఫేస్ ప్యాక్‌లే కాదు.. ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి!

మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (09:57 IST)
చర్మ రక్షణకు కేవలం ఫేసు ప్యాకులు, రకరకాల క్రీములు మాత్రమే వాడితే మాత్రం సరిపోదు. వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వీటిని తినడం వల్ల మొటిమలు రాకుండా నివారించవచ్చును.
 
చర్మంలోపల పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఇతర క్రిములు బయటకు విడుదల కావడం వల్ల మొటిమలు వస్తాయి. బచ్చలి కూరలో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమలకు యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. 
 
పసుపు చర్మంలోని మంటను తగ్గిస్తుంది. అలాగే చర్మం కాంతివంతంగా మెరవడానికి ఉపయోగపడుతుంది. సహజసిద్ధమైన యాంటీబయాటిక్‌ అయిన పసుపును ఏదో ఒక రూపంలో రోజుకు పావు చెంచా చొప్పున తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో రక్తంలోని హానికరమైన బ్యాక్టీరియా నాశనమవుతుంది.
 
క్యారెట్‌‌లో బీటా కెరోటిన్‌ రూపంలో విటమిన్‌-ఎ అధికంగా ఉంటుంది. అది మొటిమలకు కారణమయ్యే క్రిములను నాశనం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక క్యారెట్‌ అయినా తినడం ద్వారా మొటిమలు రావు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లం అధికంగా లభిస్తుంది. ఇది గుండె, చర్మం వంటి అవయవాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి