మోచేతులు అందంగా కనిపించాలంటే?

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (08:40 IST)
మోచేతులు అందంగా కనిపించాలంటే నిమ్మఉప్పును మోచేతులకు పూసి 15 నిమిషాల తర్వాత నీటితో కడగండి. చర్మంపై నల్లమచ్చలు ఉంటే శనగపిండిలో కొంచెం నిమ్మరసం కలిపి స్నానం చేసేటప్పుడు మర్దన చేస్తూ వస్తే కొంత కాలానికి మచ్చలు మాయమవుతాయి. 
 
మిలమిల మెరిసే ఛాయ, మృదువైన చర్మం కోసం బొప్పాయి గుజ్జును పది నిమిషాల పాటు ప్యాక్‌గా వేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. మెడ నలుపుగా ఉంటే బొప్పాయి గుజ్జు ప్యాక్ వేసుకుంటే నల్లని మటుమాయమవుతుంది.
 
మెడచుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే ఒక చెంచా కోడిగుడ్డులోని తెల్లసొన, పాలమీగడ కొంచెం రోజ్‌వాటర్ కలిపిన పేస్టును మెడకు పట్టించాలి. అంతే మడతలు పోయి నిగారింపు వస్తుంది.

వెబ్దునియా పై చదవండి