ఆరెంజ్ తొక్కల పౌడర్‌లో ముల్తానీ మట్టి, చందనం, పెరుగును కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేయాలి. అలాగే లేత వేపాకులు, ఆరెంజ్ తొక్కల పౌడర్, పసుపును సమపాళ్లలో తీసుకుని.. మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. కంటి వలయాలను దూరం చేసుకోవాలంటే బాదం ఆయిల్ రాయడం మంచిది.
అలాగే బార్లీ పౌడర్‌తో పసుపు పొడి, నువ్వుల నూనెను చేర్చి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. మెడ చుట్టూ వుండే నల్లటి వలయాలను దూరం చేసుకోవాలంటే.. కోడిగుడ్డు తెల్లసొనను తీసుకుని.. గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి పూతలా వేసుకుని అరగంట తర్వాత కడిగేయాలి.