కంటి కింద వలయాలు.. ముక్కుపై కళ్లద్దాల మచ్చలు పోవాలంటే? రాత్రిపూట కలబంద గుజ్జును ముక్కుపై, కంటి కింద వలయాలపై రాసుకుని మర్దన చేసి నిద్రించాలి. మరుసటి రోజు గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే.. మచ్చలు తొలగిపోతాయి. ఇలా ప్రతిరోజూ నెలపాటు చేస్తే కంటి కిందటి వలయాలు కూడా తొలగిపోతాయి.
కలబందనే కాకుండా.. కళ్లద్దాల తాలూకూ మచ్చల్ని పోగొట్టడానికి టొమాటోలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ ముక్కల్ని మెత్తగా చేసి ఆ గుజ్జును మచ్చల మీద పూతలా వేయాలి. పావు గంట తర్వాత కడిగేస్తే.. అవి క్రమంగా తగ్గిపోతాయి. ఇంకా టొమాటోరసంలో కీరా, బంగాళాదుంప రసాలు కలిపి రాసుకున్నా ఆ మచ్చల్ని పోగొట్టొచ్చుకోవచ్చు.
అలాగే నిమ్మరసంలో సహజ బ్లీచింగ్ గుణాలు అధికం. నాలుగు చెంచాల నిమ్మరసంలో అరచెంచా నీళ్లు కలిపి అందులో దూది ఉండల్ని వేయాలి. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీశాక ఆ ఉండల్ని ముక్కు మీద మచ్చలున్నచోట, కళ్ల అడుగున రాసుకోవాలి. కాసేపటికి చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.