తాజా కూరగాయలు, పండ్లు తినాలు. ముఖానిక్ క్రీమ్ ప్యాక్స్ వాడకుండా క్యారెట్, నారింజ, బొప్పాయి వంటి ఫేస్‌ప్యాక్స్ వేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంలో కాంతి వస్తుంది.
ఉదయాన్నే అల్లం, గ్రీన్ వంటివి తాగాలి. టీ తాగే అలవాటు లేకుంటే నిమ్మరసం తాగినా మంచిదే. ఉదయం ఎండలో కాసేపు నిలబడాలి. కానీ. మిట్టమధ్యాహ్నం ఎండ చర్మం మీద పడడం అంతమంచిదికాదు. ఈ ఎండ చర్మాన్ని కాంతివిహీనంగా మార్చుతుంది.
అందమైన చర్మం ఉండాలనుకుంటే సరిపోదు.. కొన్ని అలవాట్లు చేసుకోవాలంటున్నారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచాక పరగడుపున క్యారెట్, దానిమ్మ జ్యూస్ తాగాలి. ముఖ్యంగా ప్రతిరోజూ తప్పనిసరిగా పదినుండి పన్నెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి.
ముఖంపై ఉండే మచ్చలు, నొప్పి కలిగించే మొటిమల వంటి వాటిని గిల్లకూడదు. గిల్లితే అవి ఇంగా ఎక్కువైపోతాయి. కాబట్టి ముఖ్యంగా సహజమైన ఫేస్‌ప్యాక్స్ వేసుకునే ముందు ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడగాలి లేదా ఐస్‌క్యూబ్స్‌తో శుభ్రం చేసుకోవాలి.