పచ్చి పాలతో అందానికి మెరుగులు.... ఎలా?

శనివారం, 5 మే 2018 (17:11 IST)
పచ్చిపాల క్లెన్సర్: చర్మం మీద కంటికి కనిపించని దుమ్ము పేరుకుపోతుంది. దాన్ని తొలగించాలంటే క్లెన్సర్‌ను మించిన ఆయుధం మరొకటి లేదు. అయితే అందుకు రసాయనాలతో నిండిన క్లెన్సింగ్ ఉత్పత్తులు వాడడం కంటే కూడా ఎటువంటి హాని కలిగించని పచ్చి పాలు వాడటం బెటర్. ఇవి మంచి క్లెన్సర్‌గా పనిచేస్తాయి. అదెలాగంటే పచ్చిపాలలో దూదిని ముంచి మీ మూఖాన్ని శుభ్రం చేసుకున్నట్లైతే మీ చర్మం తాజాగా ఉంటుంది.


తేనె, నిమ్మరసం చెక్కల ప్యాక్:
నిద్రకు ఉపక్రమించే ముందు మాత్రమే పాటించాల్సిన చిట్కా ఒకటి ఉంది. అదేంటంటే నాలుగైదు చుక్కల పచ్చి తేనెను నిమ్మ చెక్క మీద పోయాలి. ఆ చెక్కతో ముఖ చర్మం మీద సున్నితంగా ఒక నిమిషం పాటు రుద్దాలి. ఐదు నిమిషాలు పాటు ఆలానే ఉంచి ఆ తరువాత ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఈ చిట్కాను నిద్రపోయే ముందు ఎందుకు చేయాలంటే నిమ్మ వంటి సిట్రస్ జాతి ఫలాలు కాంతి గ్రాహకాలు, అందుకని పగటి సమయంలో చేయడం వల్ల ఫలితం ఉండదు. చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు