పల్లెటూళ్ళలోని పలు ప్రాంతాల్లలో పొలాల గట్ల పైన రాళ్ళు రప్పల మధ్య అధికంగా కలబంద ఏపుగా పెరుగుతుంది. కలబంద చెట్టును గుమ్మానికి వేలాడదీయడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ కలబందను ఆంగ్లంలో అలోవెరా అని పిలుస్తారు.
1. కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనెను వేసి మోచేతులు, మోకాళ్ళకు మన శరీరంలో నల్లగా ఉన్న ప్రదేశాలలో రాసి కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగితే నల్లటి మచ్చలు పోతాయి.
2. కలబంద గుజ్జును కాలిన చోట రాస్తే గాయం తగ్గడమే కాక మచ్చకూడా పడకుండా ఉంటుంది.
3. రోజ్‌వాటర్‌తో కలబంద రసాన్ని కలిపి ముఖానికి పట్టిస్తే పొడిబారిన చర్మం కళకళలాడుతుంది.