తులసి ఆకులు ఆరోగ్యానికి కాదు అందానికి కూడా చాలా ఉపయోగపడుతాయి. తులసి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మెుటిమలను తొలగించుటకు దోహదపడుతాయి. ఈ ఆకులను ఎలా వాడాలంటే.. తులసి ఆకులను ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
అలానే వేపాకులను పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన ముఖం మెుటిమలు తొలగిపోయి కాంతివంతంగా, తాజాగా మారుతుంది.