ఓట్‌ మీల్‌తో ఇన్ఫెక్షన్లకు దూరం.. కలబందను దురదగా ఉన్న చోట రాస్తే?

గురువారం, 4 ఆగస్టు 2016 (10:07 IST)
ఓట్‌మీల్ ఉండే కారకాలు చర్మంపై దురదను కలుగ జేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీన్ని తయారు చేయటానికి, రెండు చెంచాల నీటిని శుద్దమైన ఓట్ మీల్‌కి కలిపి కొన్ని నిమిషాల వరకు అలానే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని దురద ప్రభావిత ప్రాంతాలకి పూసి ఒక గంట పాటూ అలానే ఉంచి, తరువాత నీటితో కడిగేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఆరెంజ్ తొక్కల్ని చర్మంపై రాయడం ద్వారా దురదలను దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే తులసి ఆకులు చర్మం పైన వచ్చే దురదలను పోగోడుతుంది. తులసి ఆకులలో చర్మంపైన కలిగే ఇన్ఫ్ల-మేషన్‌లను తొలగించుకోవచ్చు. నీటిలో తులసి ఆకులను వేసి బాగా వేడిచేసి, చల్లార్చి దురద ప్రభావిత ప్రాంతాలలో పెట్టండి. ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ-సెప్టిక్, యాంటీ-ఫంగల్ గుణాలని కలిగి ఉండటం వలన సులభంగా దురదలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక చిన్న కాటన్ ముక్కని తీసుకొని ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ప్రభావిత ప్రాంతాలలో పూయండి.  
 
ఇక దురదలను తగ్గించుకోవాలంటే పెట్రోలియం జెల్లీని రాయాలి. ఇంకా పండ్ల తొక్కల వలన కూడా చర్మంపైన వచ్చే దురదలను తొలగించవచ్చు. చర్మం పైన దురదలు వచ్చినపుడు, పండ్ల తొక్కలతో రాయటం వలన దురదల వలన కలిగే వాటి నుండి ఉపశమనం పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి