కాఫీ తాగితే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయా?

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (10:15 IST)
కాఫీ తాగితే కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కళ్ళ కింద నల్లటి వలయాలకు డీ హైడ్రేషన్, అలర్జీ, జన్యుపర అంశాలు, సరిపోయేంత స్థాయిలో నిద్ర లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. 
 
రోజు కప్పు కాఫీ తాగటం వలన కళ్ళ కింద ఏర్పడిన వలయాలను తొలగించుకోవచ్చు, కానీ జన్యుపరంగా సంక్రమించిన కంటి కింద వలయాలను తొలగించలేం. కళ్ళ కింద ఉండే రక్తం తొలగిపోవటం వలన జన్యుపరంగా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాంటప్పుడు కెఫిన్ వుండే కాఫీ తాగడం వలన చర్మ సంబంధిత రోగాలు దూరమవుతాయి.  
 
ఒక కప్పు కాఫీలో చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలను కాఫీ తొలగిస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటాన్ని నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి