ముఖంపై ఉండే నలుపుదనం, బ్లాక్‌హెడ్స్ తగ్గించుకోవడానికి కొత్తిమీర, నిమ్మరసం చక్కని పరిష్కారం. కొత్తిమీర ముద్దలో రెండు చెంచాల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. కొత్తిమీర ముద్దలో కాసిని పాలు, చెంచా తేనె, నిమ్మరసం కలపాలి. దీనిని ముఖానికి పూతలా వేసుకుని ఆరిన తర్వాత కడిగేస్తే.. చర్మం మెరిసిపోతుంది.
ఇంకా రోజూ ఉదయాన్నే కలబంద గుజ్జును, గుప్పెడు వేపాకుని కలిపి నీటిలో మరిగించాలి. ఆ నీళ్లలో రోజూ ఉదయాన్నే ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. బొప్పాయి గుజ్జులో చెంచా పాలు, చెంచా తేనె కలిపి దాన్ని ముఖానికి రాసి.. మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తద్వారా చర్మం నిగారింపుగా మారుతుంది.