బొప్పాయి సహజ పీలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మెుటిమలు, మచ్చల్ని తొలగించుటలో చాలా సహాయపడుతుంది. బొప్పాయి పండును గుజ్జుగా చేసుకుని అందులో తేనె, పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే మచ్చల్లేని చర్మం మీ సొంతమవుతుంది.
ఎక్కువగా బయట తిరగడం వలన చర్మంపై మురికి చేరుతుంది. అలాకాకుండా ఉండాలంటే టమోట గుజ్జులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని సున్నితంగా మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మం తాజాగా మారుతుంది. ముడతలు చర్మాన్ని కాంతి విహీనంగా మారుస్తుంది. బొప్పాయి గుజ్జులో కొద్దిగా బియ్యప్పిండిని కలుపుకోవాలి.
ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు చర్మం తగ్గి చర్మం బిగుతుగా మారుతుంది. రెండు స్పూన్స్ తేనెలో కొద్దిగా కోడిగుడ్డు సొనను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
బంగాళాదుంప గుజ్జులో రెండు చెంచాల ఓట్స్, రెండు చెంచాల పాలు, తేనె, ఆలివ్ నూనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.