నార్మల్ స్కిన్‌: పెరుగుతో ఫేస్ వాష్ చేసుకుంటే?

మంగళవారం, 18 నవంబరు 2014 (17:14 IST)
నార్మల్ స్కిన్ కోసం పెరుగుతో ఫేస్ వాష్ మంచి ఫలితం ఇస్తుంది. సాధారణంగా నార్మల్‌గా ఉండే ముఖంను రెగ్యులర్‌గా రొటీన్‌గా శుభ్రం చేస్తుండాలి. ముఖ్యంగా ప్రతి రోజూ నిద్రలేవగానే ఒక మంచి క్లెన్సర్‌తో ముఖంను శుభ్రం చేసుకోవాలి. 
 
చాలా మంది ఉదయం నిద్రలేవగానే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటారు. కానీ మరికొంత మంది మార్కెట్లో లభించే ఫేస్ క్లెన్సర్‌ను ఉపయోగించి ఫేస్ వాష్ చేసుకుంటారు. 
 
అయితే నార్మల్ స్కిన్ కలిగి ఉన్నవారు పెరుగును ఎంపిక చేసుకోవచ్చు. పెరుగును ముఖం మీద అప్లై చేసి కొద్ది సమయం 15-20నిముషాలు అలాగే వదిలి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మం నార్మల్‌గా స్మూత్‌గా, క్లియర్‌గా అనిపిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి