సిల్కీ అండ్ స్మూత్ హెయిర్ కోసం హెన్నా ఎగ్ ప్యాక్ ట్రై చేయండి. మృదువైన కేశాలతో పాటు హెన్నా జుట్టుకు నేచురల్ కలర్‌ను అందిస్తుంది. ఎగ్ ప్లస్ హెన్నాను మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట ఉంచి తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రంగు, జుట్టు నాణ్యత పెరుగుతుంది. స్మూత్‌గా మారుతుంది.
కోడిగుడ్డుతోనూ జట్టును మృదువుగా మార్చుకోవచ్చు. జుట్టు పొడవును బట్టి ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకొని గిన్నెలో వేసి బాగా గిలకొట్టి, జుట్టు మొత్తానికి పట్టించాలి. పట్టించిన అరగంట అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీరు, షాంపుతో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.