కీరదోస, రోజ్ వాటర్ ప్యాక్‌తో.. ముఖం మృదువుగా..?

బుధవారం, 17 అక్టోబరు 2018 (14:56 IST)
కంటి నల్లటి వలయాలు తొలగిపోవాలంటే.. ఇలా చేస్తే చాలు.. వెంటనే ఉపశమనం లభిస్తుంది. దోసకాయ గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన కంటి నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.
 
బాదం నూనెలో రోజ్ వాటర్ కలిపి అందులో దూదిని ముంచి కంటి మీదు పెట్టుకోవాలి. అరగంట తరువాత దూదిని తీసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. దాంతో నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
పాలలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు