కళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. గుడ్లప్పగించి అదేపనిగా టీవీ, కంప్యూటర్లను చూడరాదు.
టీవీ చూస్తున్నప్పుడుగాని, చదివేటప్పుడుగాని, కళ్లను మూసి తెరుస్తూ ఉండాలి. మిలమిలలాడే మీ కళ్లకోసం ఏం చేయాలంటే, కంటికి దగ్గరగా, దూరంగా ఉన్న వస్తువును వేటినైనా చూడాలి.
ఒక పెన్సిల్‌ను మోచేతిదూరంలో ఉంచి, నెమ్మదిగా కళ్ల మధ్యభాగాన్ని దాని వైపుకు తేవాలి. పెన్సిల్ రెండుగా కనిపించేంత వరకు అలానే చూస్తూ ఉండాలి. మళ్లీ మీ కళ్లను మోచేతి దూరంలోకి తీసుకుపోవాలి. కనుగుడ్లను గుండ్రంగా మెుదట క్లాక్‌వైజ్‌గా తరువాత యాంటీ క్లాక్‌వైజ్‌గా తెరచి ఉంచి అరచేతులతో కళ్లను కప్పుకుని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేసేటప్పుడు తలను వంచి, తల బరువును చేతుల మీద ఆనించాలి.