కళ్ల కింద నల్లటి వలయాలకు బాదం నూనె రాసుకుంటే?

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (14:49 IST)
కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచిది. కొద్దిగా పసుపులో మజ్జిగను కలుపుకుని ఆ మిశ్రమాన్ని కళ్లు చుట్టూ రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చును.
 
పుదీనా ఆకులను పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని కళ్ల కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, కీరదోస రసం కలుపుకుని కళ్ల కింద నల్లటి వలయాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
ఇలా చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోయి కాంతివంతమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. బాదం నూనెను కళ్ల చుట్టూ రాసుకుని 5 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కాటన్‌తో తుడిచేయాలి. ఇలా చేస్తే కూడా నల్లటి వలయాలు తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు