అందం కోసం క్రీముల వాడుతున్నారా...జాగ్రత్త!

బుధవారం, 13 ఆగస్టు 2014 (17:52 IST)
చాలా మంది మరింత అందంగా కనిపించేందుకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా ప్రకటనలలో చూసి వాడేవారు చాలా ఎక్కువమందే ఉంటారు. అందం కోసం తయారు చేసే క్రీములలో హైడ్రోక్వినాన్ అనబడే రసాయనం ఇందులో ఉంటుంది. ఈ రసాయనం వలన శరీర చర్మంలో మార్పులు సంభవిస్తుంది.
 
ఇలాంటి రసాయనాలు ఉండటం వల్ల క్రీములను ఎక్కడ పూస్తారో అక్కడ నిగారింపు వస్తుంది. అంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.  దీంతోబాటు ఈ రసాయనం వల్ల ముఖంపై మెలానిన్ తయారుకావడం ఆగిపోతుంది. ఇది చర్మంలోని అడుగు భాగంలో కలర్ సెల్స్ తయారుకావడానికి దోహదపడతాయి.
 
అందంకోసం వాడే క్రీములలో ఉండే హైడ్రోక్వినాన్ రసాయనం ఉండటంమూలాన, ఇలాంటి క్రీములు నిత్యం వాడటం కారణంగా చర్మ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి కాస్మొటిక్స్ వాడకపోవటమే ఉత్తమం అంటున్నారు వైద్యనిపుణులు. 
 
 

వెబ్దునియా పై చదవండి