ముఖంపై వుండే అవాంఛిత రోమాలను తొలగించుకోవాలంటే?

బుధవారం, 18 అక్టోబరు 2017 (15:18 IST)
ముఖంపై వుండే అవాంఛిత రోమాలను తొలగించాలంటే..? ఈ టిప్స్ పాటించండి. ఆలుగడ్డను ఉడికించి మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి. ఈ గుజ్జుకు నిమ్మరసం నాలుగు టేబుల్ స్పూన్లు చేర్చాలి. ఒక స్పూన్ తేనె‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పేస్టులో చేసుకుని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. 
 
అలాగే శెన‌గ‌పిండి అర క‌ప్పు, పాలు అర క‌ప్పు, ప‌సుపు ఒక టీస్పూన్‌ తీసుకోవాలి. ఒక చిన్న‌పాటి పాత్ర‌ను తీసుకుని అందులో శెనగపిండి, పాలు, పసుపు వంటి పదార్థాలన్నింటినీ కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. అర గంట తర్వాత పూర్తిగా డ్రై అయ్యాక గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేసుకోవాలి. వారానికి ఓసారి ఇలా చేయ‌డం వ‌ల్ల అవాంఛిత రోమాలు పూర్తిగా తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు