జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే ఎగ్ మిక్సింగ్ షాంపూలను ఎంచుకోవాలి. కనీసం రెండు రోజులకోసారి తలస్నానం చేయాలి. జుట్టు మరీ జిడ్డుగా ఉంటే షాంపూ చేసుకోవడానికి ముందు నిమ్మరసాన్ని పట్టించాలి. గంట తర్వాత గోరు నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఆలివ్ ఆయిల్ రాసి తలస్నానం చేస్తే మంచిది. పొడిబారినట్లుగా అనిపిస్తే అలో జెల్‌తో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి.
ఎండిన ఉసిరికాయ పొడిలో, ఒక స్పూన్ గోరింటాకు పొడి, మెంతులపొడిని కలపండి. ఈ పొడిలో రెండు స్పూన్ల కొబ్బరి పాలు కలిపి జుట్టుకు పట్టించి ఒక గంటపాటు ఉంచండి. తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లటి, దట్టమైన శిరోజాలు మీ సొంతం.