వెంట్రుకలు నిర్జీవంగా మారితే..?

గురువారం, 19 ఫిబ్రవరి 2015 (18:04 IST)
వెంట్రుకలు నిర్జీవంగా మారితే..? కొబ్బరి పాలల్లో, చెంచా గులాబీ నీళ్లూ, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు వెంట్రుకలు రాసుకుని పది నిమిషాలయ్యాక తలస్నానం చేస్తే జుట్టుకు తగిన పోషకాలు అంది వెంట్రుకలు నిగనిగలాడుతాయి. 
 
చుండ్రు సమస్య వేధిస్తుంటే కొబ్బరినూనెలో వేపాకు, మందారపువ్వూ వేసి మరగనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాడుకు పట్టించి గంటాగి తలస్నానం చేయాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తే సమస్య దూరమవుతుంది. 

కమలా పండు రసంలో కాస్త సెనగపిండీ, పావుకప్పు పెరుగు, ఒక అరటి పండు గుజ్జు కలిపి తలకు పట్టించాలి. దీన్ని పది నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దీనివల్ల మురికి తొలగిపోతుంది. వెంట్రుకలు మృదువుగా మారుతాయి, చుండ్రు సమస్య ఉన్నప్పుడు కమలాఫలం తొక్కల పొడిలో చెంచా నిమ్మరసం కాస్త పెరుగు కలిపి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య దూరమవుతుంది.

వెబ్దునియా పై చదవండి