సాధారణంగా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ సరైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా ఏర్పడుతుంది. అంతేకాదు.. విటమిన్ల లోపం, జన్యుపరమైన కారణాలు, అధిక ఒత్తిడి, రక్త ప్రసరణ సరిగా లేకపోవుట, అపరిశుభ్రమైన చర్మముతో జుట్టు రాలుతాయి.
* జుట్టుకు పోషణ అవసరం. అందువలన మజ్జిగ, నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు వంటి జ్యూస్లను రోజుకు రెండు సార్లైనా తాగండి. అలాగే ప్రతి రోజు కనీసం 8-10 గ్లాసుల నీటిని త్రాగాలి.
* రోజూ ఒక కప్పు మొలకెత్తిన పప్పు ధాన్యాలను తీసుకోవాలి.
* ప్రోటీన్ల కోసం చికెన్, గుడ్డు ప్రతి రోజు తినాలి.