ఆవ నూనెతో శిరోజాల సంరక్షణ ఎలా?

గురువారం, 30 అక్టోబరు 2014 (15:55 IST)
చాలా మందికి శిరోజాలు అమితంగా రాలిపోతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతుంటారు. దుమ్ము, ధూళి, కాలుష్యం, పోషకాహార లోపం వల్ల కూడా ఇవి రాలిపోతుంటాయి. ఇలాంటి సమస్యలకు వంటింట్లో లభ్యమయ్యే ఆవ నూనెతో చెక్ పెట్టొచ్చు. 
 
ఆవ నూనెలో కొన్ని ఉసిరిక్కాయ ముక్కలు, మెంతి గింజలు కలిపి వేడి చేసి రాత్రి పడుకోబోయే ముందు వెంట్రుకల కుదుళ్లకు దట్టించాలి. మురసటి రోజు రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా నెలారెండు నెలల స్నానం చేస్తే వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి. అదేవిధంగా ప్రతి 2 - 3 నెలలకు ఒకసారి వెంట్రుకల చివర కత్తిరించాలి. దీనివల్ల వెంట్రుక పెళుసుబారి తెగిపోకుండా బలంగా పెరుగుతుంది. 
 
వెంట్రుకల పెరుగుదల ప్రతి రోజూ ఉంటుంది. అలాంటి వెంట్రుకలకు పోషకంగా పండ్లు, బాదంపప్పు, గుడ్డులోని తెల్లసొన, ఉసిరికాయ పొడి, నీరు కలిపి వెంట్రులకు పట్టిస్తే నిగనిగలాడుతూ, మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తాయి. 

వెబ్దునియా పై చదవండి