2. మందార పూవులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దానికి రెండు చెంచాల మెంతి పిండిని కలపాలి. దానికి కొబ్బరి, ఆలివ్ ఆయిల్‌ను సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా వేడి చేసి చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని తలస్నానం చేసే ముందు తలకు బాగా మర్ధనా చేసి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే మంచి ఒత్తైన జుట్టును పొందవచ్చు.
4. మందారపూల పొడికి అరకప్పు పెరుగు, కొంచెం నిమ్మరసం కలిపి తలకు పూతలా వేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే నిగనిగలాడే వత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఇలా క్రమంతప్పకుండా చేయడం వలన చుండ్రు, దురద సమస్య కూడా తగ్గుతుంది.
5. మందారపూలు, గుంటగలగరాకూ, గోరింటాకు కలిపి మెత్తగా నూరి తలకు పూత వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నల్లగా పొడవుగా మారుతుంది.