మహిళకు అందమైన శరీర ఆకృతిలో అత్యంత కీలకమైన భాగం నడుం. ఈ భాగాన్ని మరింత అందంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకునేందుకు చిన్నపాటి చిట్కాలను పాటిస్తే.. మరింత శక్తివంతంగానే కాకుండా, ఫ్లెక్లిబుల్‌గా కూడా అవుతుంది. ఇందుకోసం...
ముందుగా నడుముమీద చేతులుపెట్టి సౌకర్యంగా నిలబడాలి. కాళ్లను కదిలించకుండా శరీరాన్ని నాభి వద్ద మెల్లగా ట్విస్ట్ చేసినట్లు కుడివైపుకు తిప్పాలి. ఇలా చేసేటప్పుడు భుజాలను నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో 10 లేదా 15 సెకండ్లపాటు ఉండి తిరిగి మామూలు స్థితికి రావాలి. అలాగే ఎడమవైపునకు కూడా చేయాలి. ఇలా 10 లేదా 20 నిమిషాలు చేసినట్టయితే నడుము భాగం ఫ్లెక్సిబుల్‌గా అవటమేగాక, శక్తివంతం కూడా అవుతుంది. అలాగే, నడుం నొప్పి కూడా మాయమైపోతుంది.
అదేవిధంగా, స్ట్రెచ్ ఎక్సర్‌సైజులతో మడమలకు కూడా తగినంత వ్యాయామం అందించాలి. ఒక కాలిపై బరువును మోపుతూ దేహాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ముందుగా కుడికాలిని కొద్దిగా ఎత్తి, మడమ వద్ద కీలు తిరిగేటట్లుగా పాదాన్ని వలయాకారంగా తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు ముందుగా క్లాక్‌వైజ్‌లో పదిసార్లు తిప్పాలి.
తరువాత యాంటీ క్లాక్‌వైజ్‌లో పదిసార్లు తిప్పాలి. అలాగే ఎడమపాదానికి కూడా చేయాలి. ఒకవేళ ఒక కాలిపై బ్యాలెన్స్ చేయటం సాధ్యంకాకపోతే కూర్చుని చేస్తే సరిపోతుంది. పై రెండు వ్యాయామాలు నడుమును అందంగా ఉంచటమేగాకుండా, కాలి మడమలు కూడా అందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.