తేనె-కోకోనట్-బటర్ కాంబినేషన్‌తో అవాంఛిత రోమాలను..

బుధవారం, 29 ఏప్రియల్ 2015 (17:01 IST)
తేనె, కోకోనట్, బటర్ కాంబినేషన్‌తో అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. తేనె, కోకోనట్, బటర్‌ను మిశ్రమంలా చేసుకుని వాక్స్‌గా ఉపయోగించి అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. అలాగే అన్ని రకాల బాడీ వాష్ క్రీములు లేదా నేచురల్ బాడీవాష్‌లలో కూడా తేనెను మిక్స్ చేసి ఉంటారు. 
 
అలాగే దాల్చిన చెక్క స్కిన్ డ్యామేజ్‌ను అరికడుతుంది. దాంతో పాటు జుట్టుకు తగినంత పోషక లక్షణాలను అందిస్తుంది. ఎందుకంటే ఈ దాల్చిన చెక్కలో ఉండే లక్షణాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. హనీ మాస్క్‌ను జుట్టుకు వేసుకోవడం వల్ల ఇది జుట్టుకు ఎక్కువ బలాన్ని చేకూర్చుతుంది.
 
ఇకపోతే.. తేనెను మిక్స్ చేసిన నీటిలో కాళ్ళ డిప్ చేయడం వల్ల కాళ్ళు మృదువుగా ఎక్స్ ఫ్లోయేట్‌గా మారుస్తాయి. అంతే కాదు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, చర్మం సున్నితంగా మారుతుంది. చర్మం నునుపుగా, ఆరోగ్యంగా మారాలంటే, ఈ బాడీ వ్రాప్ చాలా సూపర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా తేనె మిక్స్ చేసి శరీరానికి పట్టించడం వల్ల చర్మం టైట్‌గా మరియు నునుపుగా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి