శరీరంలో వేడి అధికంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

సోమవారం, 29 అక్టోబరు 2018 (12:05 IST)
కొందరికి ముఖంపై మెుటిమలు ఎక్కువగా ఉంటాయి. ఈ మెుటిమల కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. ముఖంపై మెుటిమలు ఉండడం ఎవరూ ఇష్టపడరు. అందుచేత ఈ సమస్య నుండి ఎలా ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం..
 
మీరు తీసుకునే రోజువారి ఆహారంలో ఆయిల్ నూనె తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ నూనెలోని పోషక విలువలు చర్మానికి మంచి అందాన్ని చేకూర్చుతాయి. విటమిన్ ఎ, సి, ఇ గల ఆహార పదార్థాలు తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంటే.. యాపిల్, క్యారెట్స్, నట్స్, నిమ్మకాయ వంటి తదితర ఆహారాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నారింజ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
మరి నారింజతో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. నారింజ తొక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, చక్కెర, పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే... ముఖంపై మెుటిమలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. 
 
సెలీనియం పుష్కలంగా ఉండే నట్స్, తృణ ధాన్యాలను తరచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటే మెుటిమలు రావు. అసలు మెుటిమలు ఎందుకు వస్తాయంటే.. శరీరంలో కొవ్వు, వేడి అధికంగా ఉన్నప్పుడు మెుటిమలు ఏర్పడుతాయి. కనుక కొవ్వును కరిగించే ఆహార పదార్థాలు తీసుకుంటే మెుటిమలు రావు. దాంతో చర్మం తాజాగా మారుతుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు