ఈ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటకు తీశాక దూదితో ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. మెుటిమలు, మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలు దూరమవుతాయి.
ముల్తానీ మట్టిలో చెంచా బంగాళాదుంప గుజ్జ, నాలుగు చుక్కల రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి.