నిమ్మరసంలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి...?

శుక్రవారం, 15 మార్చి 2019 (11:44 IST)
చాలామందికి ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాస్త కూడా తేడా కనిపించలేదు. ముఖ్యంగా ఈ మచ్చలు ముక్కు, నుదురు, చెంపలపై ఎక్కువగా వస్తుంటాయి. వాటిని రసాయనాలతో కంటే.. ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగించి తగ్గించుకోవడం మంచిది. 
 
రెండు స్పూన్ల్ నిమ్మరసంలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని అరగంట పాటు అలానే ఉండాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖంపై గల మచ్చలు పోతాయి. 
 
స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా తేనె, పాలు, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మచ్చలు తగ్గుముఖం పడుతాయి. 
 
టమోటా గుజ్జులో స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి మచ్చలున్న చోట రాసుకోవాలి. రాత్రంతా అలానే ఉంచి.. ఉదయాన్నే చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. తరచు ఇలా చేయడం వలన మచ్చల బాధ పోతుంది.
 
రెండు స్పూన్ల్ ఓట్స్ పొడికి తగినంత నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న ప్రాంతాల్లో రాసుకుని రెండు గంటలపాటు ఉంచి.. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తుంటే.. మచ్చలు పోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు