వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పలురకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
వేపనూనెతో వారానికి రెండుసార్లు తలకి మసాజ్ చేస్తే జుట్టు రాలటం, చుండ్రు సమస్యలు పోతాయి. తలలో ఉండే చిన్నపాటి గాయాలు త్వరగా మానిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది. జుట్టు నిర్జీవంగా ఉంటే వేపాకును దంచి ఆ పేస్ట్‌ని తలకి పట్టించి తల స్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది.