చాలామంది తరచు స్నానం చేసేటప్పుడు లేదా రాత్రి పడుకునేముందు రోజులో మూడు నుండి 5 సార్లు చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మరంధ్రాల్లోని వేడిని తగ్గించడమే కాకుండా.. ఎక్కువగా చెమట బయటకు రాదు. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది.
ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు వేసవిలో వాడే టాల్కమ్ పౌడర్ కొద్దిగా ముఖానికి రాసుకుంటే మంచిది. పౌడర్ వాడడం వలన ముఖంలో అధికంగా వచ్చే చెమటను అడ్డుకుంటుంది. కనుక అసౌకర్యం కలగదు. ఒకవేళ అలా కాదనుకుంటే.. రోజూ రాత్రి నిద్రించే సమయంలో కీర దోసకాయల రసాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే.. ముఖానికి చెమట పట్టడం తగ్గుతుంది.