రోజువారీ హెయిర్ వాష్ చేయడం మంచిదా?

బుధవారం, 27 ఆగస్టు 2014 (17:42 IST)
రోజువారీ హెయిర్ వాష్ చేయడం మంచిదా? ప్రతిరోజూ తలస్నానం అవసరం లేదు. ఎందువల్ల అంటే షాంపూలతో కఠినమైన రసాయనాలు ఉంటాయి. కాబట్టి తల మీద ఉండే ముఖ్యమైన నూనెలు పూర్తిగా తొలగింపబడతాయి. దీనివలన తల మీద తేమ పూరిగా ఇగిరిపోయి, ఎండినట్లుగా అవుతుంది. 
 
వారంలో మూడుసార్లు తలస్నానం మంచిది. తల మీద చెమట పట్టి, తలస్నానం చేయాలనిపించినా కూడా, కేవలం జుట్టు మీద సాదా నీరు పోయాలి. రోజూ ఓవర్ డస్ట్ పట్టినట్లైతే రోజూ తలస్నానం తప్పనిసరిగా చేయండి. కానీ మీ జుట్టుకు అనుకూలంగా ఉండే తేలికపాటి షాంపూను మాత్రమే ఉపయోగించడం మంచిదని బ్యూటీ నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి