సెల్ ఫోన్లు కూడా మొటిమలకు కారణమవుతాయా?

శుక్రవారం, 14 జులై 2017 (13:09 IST)
ఏంటి? సెల్ ఫోన్ మొటిమలకు కారణమవుతుందా? అని షాకవుతున్నారు కదూ.. నిజమే.. అంటున్నారు వైద్యులు. బాత్రూం తలుపు గొళ్లెంతో పోలిస్తే.. సెల్‌ఫోను తెర ఉపరితలంపై 18 రెట్లు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని.. ఆ సెల్‌ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతాం కాబట్టి.. అందులో ఉండే బ్యాక్టీరియా ముఖంలోకి చేరి.. మొటిమలకు కారణం అవుతుంది. కాబట్టి మొబైల్‌ని రెండురోజులకోసారయినా శుభ్రం చేయడం మంచిదని గమనించండి. అలా శుభ్రం చేయకపోతే.. తప్పకుండా ముఖం అందవిహీనంగా మారడం.. ముడతలు పడటం జరుగుతుంది.
 
ఇక నిద్రించే దిండ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. దిండ్ల కవర్లపై మురికి కారణంగా బ్యాక్టీరియా పెరిగి.. అది చర్మంలోకి చేరుతుంది. అప్పుడే మొటిమలు ఎదురవుతాయి. అందుకే దిండు కవర్లను వారానికి ఓసారి ఉతకాలి. మేకప్‌ బ్రష్‌లు కూడా బ్యాక్టీరియాకి ఆవాసాలే. వాటితో మేకప్‌ వేసుకున్నప్పుడల్లా అదే బ్యాక్టీరియా ముఖంలోకి చేరుతుంది. దాంతో మొటిమలు మొదలవుతాయి. ఆ సమస్యను తగ్గించుకోవాలంటే కనీసం వారానికోసారి మేకప్‌ బ్రష్‌లూ, స్పాంజిలను కడగాల్సి ఉంటుందని.. ఇలా చేస్తే మొటిమలు దూరమవుతాయని స్కిన్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి