నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేసుకుంటే?

శుక్రవారం, 7 జూన్ 2019 (22:19 IST)
సాధారణంగా కొంతమంది మోచేతులు, మోకాళ్లుపై చర్మం నల్లగా, గరుకుగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యను మన ఇంట్లోనే ఉన్న పదార్థాలతోనే మనం నివారించుకోవచ్చు. ఈ సమస్యకు ఎన్నో రకాల క్రీంలు, కాస్మోటిక్స్ ఉన్నప్పటికి వీటివలన సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంది. అందువలన సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్థాలతో ఏవిధంగా చేయాలో చూద్దాం.
 
1. తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అరచెంచా పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
2. సగానికి కోసిన నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేసుకోవాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తుంటే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. అలానే తేనెలో పంచదార కలిపి నల్లగా ఉన్న చోట రుద్దుకోవాలి. 
 
3. పెరుగులో నాలుగు చుక్కల వెనిగర్‌ కలిపి.. మోచేతులకు రాసుకోవాలి. తరవాత గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. పులిసిన పెరుగు కూడా బాగా పని చేస్తుంది. 
 
4. గోరువెచ్చటి కొబ్బరి నూనెలో చెంచా నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకోవాలి. తరవాత వేడినీళ్లలో తడిపిన టవల్‌ని చుట్టుకోవాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల సమస్య క్రమంగా తగ్గుతుంది.
 
5. అలాగే మూడు చెంచాల సెనగపిండిలో కాస్త పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. ఆరాక నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే కలబంద గుజ్జు రాసుకున్నా సమస్య దూరమవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు