మీరు గ్లామరస్‌గా కనిపించాలంటే ఈ మెళకువలు పాటించండి

మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (10:02 IST)
సాధారణంగా పార్టీలకు వెళ్ళాలంటే ఎలాంటి మేకప్ వేసుకావాలి అన్న ఆలోచనలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సరైన అవగాహన లేక కొందరు సాధారణ పార్టీలకు కూడా భారీగా మేకప్ చేసుకుంటారు. అయితే ఎలాంటి పార్టీలకన్నా మీరు గ్లామరస్‌గా కనిపించాలంటే కొన్ని మేకప్ మెళకువలు తెలుసుకోవాలి. పార్టీలకి వెళ్ళే వారు ఎలాంటి మేకప్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 
 
మేకప్‌ చేసుకునేటప్పుడు కళ్ల చుట్టూ ఉన్న ముడతలు కనపడకుండా చేయటానికి డార్క్‌ కలర్‌ ఐషాడో వాడకూడదు. ఎందుకంటే దీంతో ముడతలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి బదులు మ్యాట్‌ కలర్‌ ఐ షాడో వాడటం మంచిది. ఈ కలర్‌తో ముడతలు, డార్క్‌ సర్కిల్స్‌ తక్కువగా కనపడతాయి. ఫౌండేషన్‌ వేసుకోవడానికి ముందు మాయిశ్చరైజర్‌ తప్పకుండా రాయండి. దీంతో ఫౌండేషన్‌ ముఖమంతా సమంగా పరచుకుంటుంది.
 
కళ్లు అందంగా కనిపించాలంటే కళ్లకు కాటుక పెట్టుకోవచ్చు. ఐ లైనర్‌ పెట్టుకుంటే కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. దీనికోసం బ్లాక్‌ కలర్‌ ఐ లైనర్‌ వాడవచ్చు. మీ కనుబొమ్మలు సన్నగా ఉంటే వాటికి బ్లాక్‌ కలర్‌ ఐ బ్రో పెన్సిల్‌తో సరైన ఆకృతి ఇవ్వవచ్చు. కళ్లకు ప్రత్యేక మేకప్‌ వేసుకున్నప్పుడు మిగిలిన భాగాలను సింపుల్‌గా వదిలేయండి. 
 
వయస్సు పెరుగుతున్న కొద్దీ పెదవులు పగలటం, పొడిబారటం ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు డార్క్‌, కలర్‌ లిప్‌స్టిక్‌ బదులు లైట్‌ కలర్‌ వాడండి. డార్క్‌, షేప్‌ లిప్‌ లైనర్‌ వాడకపోవడం మంచిది. బుగ్గలపై బ్రైట్‌ పింక్‌ వాడుతున్నట్లయితే పెదవులపై ఏమీ పెట్టుకోవద్దు. 

వెబ్దునియా పై చదవండి