సంపూర్ణ చర్మ సంరక్షణ కావాలంటే

సోమవారం, 19 ఆగస్టు 2019 (16:04 IST)
ఆర్గానిక్, నేచురల్, వీగన్, గోగ్రీన్ లాంటి హ్యాష్‌ట్యాగ్స్ ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో తరచూ కనిపిస్తున్నాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇవి ప్రముఖమైన పదాలుగా మారాయి. కారణం అవి పాకశాస్త్రంలోనే కాదు. శరీరసౌందర్యాన్ని పెంపొందించుకోవడంలోనూ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. 
 
గతంలో మన ఇళ్లలో పసుపు, చందనం, పాలతో స్నానం చేయించేవారు. వాటిని మనం పాతపద్ధతులంటున్నాం. కానీ అవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌గా మారాయి. సంపూర్ణ చర్మ సంరక్షణ కావాలంటే మనం ఉపయోగించే ఉత్పత్తుల్లో కొన్ని తప్పక ఉండాలి. అవి ఏటంటే...
 
చందనం: క్రమం తప్పకుండా చందనం ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా ఉపయోగాలు. ముఖ్యంగా చందనం బ్యాక్టీరియాను రాకుండా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ట్యాన్‌ని అరికడుతుంది. అన్నిటికీ మించి మీ చర్మం పొడిబారకుండా చేస్తుంది. దీనివల్ల మీ చర్మంపై ఎలాంటి ముడతలు కన్పించవు. 
 
పసుపు: చర్మంపై ఉండే మచ్చలను తొలగించి ముఖం ప్రకాశవంతంగా కన్పించేలా చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా చేస్తుంది. అన్నిటికీ మించి మొటిమల నివారణకు పసుపుని మించిన ఔషధం లేదు. పసుపు క్రమం తప్పకుండా వాడితే మొటిమలు రావు. 
 
కుంకుమ పువ్వు: కుంకుమ పువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా స్వచ్ఛంగా, స్మూత్‌గా తయారవుతుంది.
 
కలబంద: కలబందను అలోవెరా అని కూడా అంటారు. ఇది చర్మంపై ఒక పొరలాగా ఉపయోగపడుతుంది. ఈ లేయర్ వల్ల చర్మంపై ఎప్పుడూ తేమ ఉంటుంది. అంతే కాదు ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతగా మారుస్తాయి.
 
బాదం పాలు: ఎండ వేడి వల్ల చర్మం పాడవకుండా కాపాడుతుంది. 
 
ఈ సహజసిద్ధమైన పదార్ధాలతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు చర్మాన్ని ప్రకాశవతంగా, యవ్వనంగా ఉంచుకోవచ్చు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు