పంచదారతో బాడీ స్క్రబ్ ఎలా చేయాలి..? మేలేంటి?

బుధవారం, 18 నవంబరు 2015 (17:34 IST)
చర్మ సౌందర్యంపై నేటి యువతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. చర్మ సంరక్షణలో పంచదార ఎంతో మేలు చేస్తుంది. పంచదార మృతకణాలను నశింపజేస్తుందని బ్యూటీషియన్లు పేర్కొంటున్నారు. పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తేమగా ఉంటుంది. 
 
మరి పంచదారతో బాడీ స్క్రబ్ ఎలా చేయాలంటే.. పావు కప్పు ఆలివ్ నూనెలో అరకప్పు ముదురు రంగు చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి పంచదార అణువులు కరిగే వరకు రుద్దితే మృత కణాలు తొలగిపోవడంతో పాటు చర్మ మృదువుగా, తేమగా ఉంటుంది. బ్యాక్టీరియాను హరింపజేసే లక్షణం కూడా పంచదారకుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. 
 
గాయాలను మాన్పడం, ఇన్ఫెక్షన్లను తొలగించే నివారిణిగా పంచదార ఉపయోగపడుతుంది. ఇక చర్మాన్ని బిగుతుగా ఉంచే యాంటీ ఏజింగ్ క్రీముల్లో తేనెను వాడతారు. ముఖం మీద మచ్చలకు కూడా తేనెను వాడుతారని బ్యూటీషియన్లు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి