ఉల్లిగడ్డల రసంలో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

గురువారం, 9 ఆగస్టు 2018 (11:55 IST)
ఉల్లిగడ్డల రసం సౌందర్యానికి కూడా పనిచేస్తుంది. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుని అందులో ఆలివ్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు రాకుండా ఉంటాయి. ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసుకుని వాటిని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి.
 
ప్రతిరోజూ ఇలా చేయడం వలన ముడతలు చర్మం కాస్తా తాజాగా మారుతుంది. ఉల్లిగడ్డ రసంలో పెరుగును, లావెండర్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఉల్లిగడ్డల రసంలో కొద్దిగా శెనగపిండి, పచ్చిపాలను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. వారానికి రెండె సార్లు ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు