పొడిబారిన చర్మానికి బ్యూటీ టిప్స్: కమలారసం-ఆలివ్ ఆయిల్‌తో..

గురువారం, 19 ఫిబ్రవరి 2015 (18:39 IST)
పొడిబారిన చర్మం తాజాగా మారాలంటే.. కమలాఫలం రసంలో ఆలివ్ నూనె కలిపి చర్మానికి రాసుకుని గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం తాజాగా కనిపిస్తుంది.

మృతకణాలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల గులాబీరేకుల పొడిలో చెంచా బాదం నూనె, చెంచా కమలా ఫలం రసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరాక కడిగేసుకుంటే సరి.
 
కాలుష్యంతో పాటు కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల చర్మం నిగారింపు కోల్పోతే.. కమలాఫలం రసంలో చెంచా తేనె, పచ్చిపాలూ, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసి పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత సబ్బులేకుండా స్నానం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి