పుదీనాతో అందం... ఎలాగో తెలుసా?

శనివారం, 23 మే 2020 (16:20 IST)
ఆరోగ్య పరంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడే పుదీనా చర్మ సౌందర్యాన్ని అందాన్ని కాపాడుకోవడానికి కూడా బాగా పనికొస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా చేయడమే కాకుండా కేశ సంరక్షణకు బాగా దోహదపడుతుంది. పుదీనా ఆకులను మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు వేసి కలపండి. 
 
ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని పట్టించండి, కాసేపటి తర్వాత చల్లని నీటితో కడగండి. దాంతో మీ ముఖం మృదువుగా మారుతుంది. ముఖానికి ఉన్న మొటిమలు, మచ్చలు పోవాలన్నా లేదా అవి రాకుండా ఉండాలన్నా పుదీనా ఆకుల పేస్టులో గుడ్డు తెల్లసొనను కలిపి ముఖానికి రాసుకోండి. పుదీనాలో శాలిసైలిక్ యాసిడ్ ఉండటం వల్ల మొటిమలు రాకుండా నివారిస్తుంది. 
 
పుదీనా రసంలో బొప్పాయి రసాన్ని వేసి కలిపి చర్మ వ్యాధులు ఉన్న చోట రాస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది. చర్మం తర్వగా ముడతలు పడకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించకుండా పుదీనా నివారిస్తుంది. పుదీనా నూనెను తలకి రాసుకుంటే చుండ్రు సమస్య తగ్గి, వెంట్రుకలు బలంగా అవుతాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు