బ్యూటీపార్లలో షేప్ చేసుకున్నాక కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే.. మస్కారాను ఉపయోగించడం మర్చిపోకూడదు. రెగ్యులర్గా మస్కారాను ఉపయోగించాలి. అప్పుటే అందమైన కనుబొమ్మలను పొందినవారవుతారు. మస్కారా యూజ్ చేయడం ద్వారా కనుబొమ్మలు దట్టంగా తయారవడంతో పాటు మంచి రంగునిస్తాయి. అలాగే క్రమం తప్పకుండా వాస్లిన్ రాసుకోవాలి.
ఇక కనుబొమ్మల ఆరోగ్యానికి ఆహారం విషయంలో మెలకువ అవసరం. తీసుకునే ఆహారంలో విటమిన్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో బి6, సీ, బయోటిన్ ఉండేలా చూసుకోవాలి. మంచి కాస్మెటిక్స్ వాడటం.. నిద్రించేటప్పుడు ఆముదాన్ని రాసుకోవడం ద్వారా కనుబొమ్మలు మరింత అందంగా తయారవుతాయి.