బ్యూటీపార్లర్లకు ఎందుకు..? మచ్చలు, మొటిమలు తగ్గాలంటే?

గురువారం, 17 ఆగస్టు 2017 (15:22 IST)
పంచదారను మిక్సీలో రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. అందులోనే నిమ్మరసం కలుపుకుని పక్కనబెట్టుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఐదు లేదా పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. పొడి బట్టతో తుడుచుకున్నాక బౌల్‌లో వున్న పంచదార మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్క్రబ్ చేసుకుంటూ.. మొటిమలు వున్న చోట శుభ్రం చేసుకుంటూ కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే చర్మానికి గ్లో వస్తుంది. మచ్చలు. మొటిమలు తగ్గిపోతాయి. బ్యూటీపార్లర్ల వెంట తిరగాల్సిన అవసరం వుండదు. 
 
అలాగే చర్మపు మృతకణాలు తొలగి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్‌, కీర దోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి అందులో ఓట్‌మీల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.

చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్‌, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్‌ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.

వెబ్దునియా పై చదవండి